హైదరాబాద్: టీడీపీ నేత సీఎం రమేష్ నివాసంలో ఐటీ దాడులు నిర్వహస్తున్న నేపథ్యంలో దీనిపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ  మోదీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పెట్టుబడులు రాకుండా చెయ్యాలనే కుట్రలో భాగంగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కడప ఉక్కుకర్మాగారం కోసం పోరాడినందుకే ఎంపీ సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. హోదా సాధన కోసం పోరాటం ఆపేదిలేదన్నారు.  కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్‌ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING