Nara Lokesh in Mangalagiri: మంగళగిరిలో ఈసారి గెలుపు నాదే.. రాంగోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ డైరెక్టర్
Nara Lokesh to contest From Mangalagiri: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంగళగిరి నుండే పోటీ చేస్తానన్న నారా లోకేష్.. భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తంచేశారు. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Nara Lokesh to contest From Mangalagiri: వైసీపీ నేతలకు విజన్ అంటే ఏంటో తెలియదు అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో అప్పట్లో చంద్రబాబు నాయుడు సైబర్ టవర్ కడితే... కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అవహేళన చేశారు. కానీ ఈ రోజు అదే సైబర్ టవర్ ఐటి పరిశ్రమకు కేంద్రంగా నిలిచింది. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి విజనరికి విజన్ ఉంటుంది కానీ... ప్రిజనరికి ఏం తెలుస్తుందన్నారు. ప్రిజనరీకి జైల్ అంటేనే తెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంగళగిరి నుండే పోటీ చేస్తానన్న నారా లోకేష్.. భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తంచేశారు. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే ఆళ్లపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి ప్రజల సమస్యలు అసలు పట్టవు. మంగళగిరి ప్రజలతో తాను దైర్యంగా సెల్ఫీ దిగాను... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఒక ఫోటో దిగే ధైర్యం చేయగలరా అని సవాల్ విసిరారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్ర గురించి నారా లోకేష్ మాట్లాడుతూ, పాదయాత్ర మొత్తం మీద తనను చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి తప్ప ఇంకెవ్వరూ ఇబ్బంది పెట్టలేదు అని అన్నారు.
వాళ్ళు అడ్డు వస్తే తప్ప తాము కూడా పాదయాత్రలో ఎవరిని అడ్డుకోలేదన్నారు. పాదయాత్ర మొదలై 6 నెలలు అయింది. ఎక్కడ కూడా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని.. అయినప్పటికీ తమ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి నారా లోకేష్ మాట్లాడుతూ, రాంగోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ డైరెక్టర్... సినిమా కోసం అతను రోడ్స్ బ్లాక్ చేస్తే అనుమతి ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని, పోలీసులను నిలదీశారు. తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో నారా లోకేష్ .. డైరెక్టర్ రాంగోపాల్ వర్మను కూడా కెళికారు. ఎవరైనా తన జోలికి వస్తే అవతలి వారు ఎంతటి వారైనా.. వారిని అంత ఈజీగా విడిచిపెట్టని మనిషిగా వర్మకు పేరుంది. మరి లోకేష్ చేసిన థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ కామెంట్స్‌కి వర్మ ఎలాంటి రియాక్షన్ ఇవ్వనున్నాడా అనేది కూడా ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి : Billionaires in Rajya Sabha: పెద్దల సభలో పెద్ద పెద్ద బిలియనీర్లు.. అందులో మన తెలుగు శ్రీమంతులే ఎక్కువ
మరొక 6 నెలల్లో కరకట్ట కమల్ హసన్‌ను ఇంటికి పంపడం ఖాయం అంటూ పరోక్షంగా ప్రభుత్వాధినేతను నారా లోకేష్ ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏమి చేయలేదు అని పాదయాత్రలో ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎమ్మెల్యేలకు కుల రాజకీయాలు చేయడం తప్ప ఇంకేమీ తెలియదన్న నారా లోకేష్.. అందుకే ఏపీ అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కి పోయిందని ఆరోపించారు. అన్ని విషయాల్లో కులం పేరు ప్రస్తావన తీసుకొచ్చి ఏపీని నాశనం చేశారు. తాము ఆనాడు కులం చూసి ఉంటే కియా కార్ల తయారీ సంస్థ అనంతపురం వచ్చేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నారా లోకేష్.. వైసీపీ నేతలు కులం అనే పేరు తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందుతున్నారు అని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Pawan Kalyan on Alliance With TDP and BJP: వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి