Lok Sabha Deputy Speaker: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్.. ఆ పదవి టీడీపీకే..!
Lok Sabha Deputy Speaker: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇవ్వనున్నారా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర రాజకీయ వర్గాలు. దాదాపు 1999 తర్వాత కేంద్రంలో చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.
Lok Sabha Deputy Speaker Post to TDP: ఏది ఏమైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్కడో సుడి ఉన్నట్టుంది. దాదాపు 25 యేళ్ల తర్వాత కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పే స్థాయికి చేరారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీ తర్వాత 16 ఎంపీ సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవులను తీసుకుంది తెలుగు దేశం. మరోవైపు లోక్ సభ లో సభను నడిపించే స్పీకర్ పదవిని తెలుగు దేశం ఆశించినా.. బీజేపీ పెద్దలు నచ్చజెప్పడంతో డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడానికి అంగీకరించినట్టు సమాచారం.
గతంలో 1998, 1999లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు బయట నుంచి మద్దతు ఇచ్చారు. అంతేకాదు అప్పటి 12వ, 13వ లోక్ సభలో కీలకమైన స్పీకర్ పదవిని తీసుకున్నారు. అప్పట్లో జీఎంసీ బాలయోగి ఈ పదవిని రెండు సార్టు చేపట్టారు. ఆ తర్వాత ఆయన విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ పదవి శివసేనకు దక్కింది. తాజాగా పాతికేళ్ల తర్వాత ఇపుడు స్పీకర్ పదవి ఆశించిన టీడీపీకి ఆ పదవికి బదులు.. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని పెద్ద పార్టీ బీజేపీ ఆఫర్ చేసినట్టు సమాచారం.
టీడీపీ తరుపున బాపట్ల నుంచి పోటీ చేసి గెలిచిన మాజీ ఐఎఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ కు ఈ పదవి దక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. పైగా డిప్లోమాట్ కాబట్టి సభ నిర్వహణతో పాటు చట్టాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటం కలిసొచ్చే అంశాలు. మరోవైపు 18వ లోక్ సభ స్పీకర్ పదవి కోసం మరోసారి ఓం బిర్లాను పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత పార్లమెంట్ సెషెన్ లో కీలకమైన బిల్లుల ఆమోదం పొండటంతో పాటు సభను సజావువగా నడిపిన అనుభవం ఓం బిర్లాకు ఉండటం కలిసొస్తోందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కాకపోతే.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు పరిశీలనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ పురంధేశ్వరి కాకుండా మరొకరికి ఈ కీలకమైన పదవిని ఇస్తారా అనేది చూడాలి. ఈ నెల 26వ తేదిన స్పీకర్ ఎవరనే దానిపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఫైనలైజ్ చేయనున్నట్టు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter