ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైద్యరంగానికి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) పెద్ద పీట వేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...ఇప్పుడు భారీగా నిధులు కేటాయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ మెడికల్ కళాశాల ( New medical colleges in ap ) ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ (Cm ys jagan ) ఇప్పటికే ఈ విషయమై ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం 2 వేల 50 కోట్ల నిధులు సైతం కేటాయించారు ఇప్పుడు. అంతేకాకుండా మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆరు చోట్ల కాలేజీల నిర్మాణం కోసం స్థలాల కొనుగోలుకై 104.17 కోట్ల రూపాయలతో పాలనా అనుమతులు మంజూరు చేసింది. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో కాలేజీల కోసం స్థలాలు కొనుగోలు చేయనున్నారు. 


విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 5 వందల కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ కోసం 550 కోట్లు, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీకు 500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 500 కోట్లు కేటాయించారు. మరోవైపు పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో ఒక్కొక్క చోట 100 ఎంబీబీఎస్ సీట్లు, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలల ఏర్పాటు జరగనుంది. Also read: Srikalahasti issue: మొన్న అంతర్వేది.. తాజాగా శ్రీకాళహస్తి..