Next Arrest RK Roja: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను గుర్తించే పనిలో పడింది. ఒకవిధంగా కక్షసాధింపు చర్యలు కూడా భావించవచ్చు. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి.. నేటి సీఎం చంద్రబాబుపై విచ్చలవిడిగా బూతులతో రెచ్చిపోయిన నాయకుల భరతం పట్టే పనిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, జోగి రమేశ్‌ తనయుడిని వివిధ కేసుల్లో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎవరూ అని చర్చ జరుగుతుండగా.. తర్వాతి అరెస్ట్‌ కొడాలి నాని లేదా ఆర్‌కే రోజా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: నెక్ట్స్‌ టార్గెట్‌ కొడాలి నాని.. చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఉత్కంఠ


 


అన్నా క్యాంటీన్ల ప్రారంభం పేరిట నాని అడ్డా అయిన గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటించి దడ పుట్టించారు. టీడీపీ శ్రేణులకు పూర్తి విశ్వాసం కల్పించారు. నాని అక్రమాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. రాజకీయంగా.. ఇతర రకంగాను నాని కోలుకోలేని విధంగా చేయాలని పార్టీ కేడర్‌కు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ దెబ్బకు నాని సైలెంట్‌ అయ్యాడు. గుడివాడలో కూడా తిరుగుతున్నట్లు లేదు. హైదరాబాద్‌ లేదా విదేశాలకు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

Also Read: Duvvada Srinivas Issue: వైఎస్‌ జగన్‌ సంచలనం.. దువ్వాడ శ్రీనివాస్ రాజీనామాకు ఆదేశం?


 


ఇక రోజా లక్ష్యం
వైఎస్సార్‌సీపీలో కీలక నాయకురాలిగా ఉన్న ఆర్‌కే రోజాకు ముప్పు పొంచి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలోనూ.. బహిరంగ కార్యక్రమాల్లోనూ రోజా రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబుపై అసభ్యకరంగా.. వ్యక్తిగత దూషణలు చేశారు. అంతేకాకుండా వెకిలిచేష్టలు చేసి దారుణంగా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. గతంలో ఆమె వ్యవహరించిన తీరుకు మహిళా నాయకురాలు అని ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు. రోజాను ఇరుకునపెట్టేందుకు ఒక అస్త్రం లభించింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.


సీఐడీ విచారణ
ఇప్పటికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందని కొందరు సీఐడీకి ఫిర్యాదు చేశారు. నాడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా అవినీతికి పాల్పడ్డారనే వార్తలు వస్తున్నాయి. నాసిరకం కిట్లు.. అస్తవ్యస్తంగా క్రీడా పోటీలు నిర్వహించినట్లు కొందరు బయటకు వచ్చి ఆరోపణలు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రోజాతోపాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై కూడా విచారణకు ఆదేశించడం గమనార్హం.


త్వరలో నోటీసులు?
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా విచారణ చేయాలని సీఐడీకి ఆదేశించింది. మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్‌లపై విచారణ చేయాలని సీఐడీకి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు కొన్ని రోజుల కిందట ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష రోజే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. త్వరలోనే రోజా, ధర్మానకు సీఐడీ నోటీసులు పంపించనుంది. వారు విచారణకు హాజరవుతారా? లేదా అని ఉత్కంఠ నెలకొంది. కాగా అవినీతి జరిగినట్లు తేలితే త్వరలోనే వారిద్దరినీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter