NFHS Survey about Adult Affairs: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైంగిక వ్యవహారానికి సంబంధించిన డేటాలో ఏపీ పురుషులకు సగటున నలుగురు కన్నా ఎక్కువ మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. అదే తెలంగాణలో ఒక్కో పురుషుడికి సగటున ముగ్గురు మహిళలతో లైంగిక సంబంధం ఉన్నట్లు తేలింది. కర్ణాటకలో ఒక్కో పురుషుడికి 2.7 మంది మహిళలతో, తమిళనాడులో ఒక్కో పురుషుడు 1.2 మంది మహిళలతో లైంగిక సంబంధం ఉన్నట్లు సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 కారణాల వల్ల భర్తను శృంగారానికి దూరంగా ఉంచడం సరైనదే :


మూడు కారణాల వల్ల భర్తను శృంగారానికి దూరంగా ఉంచడం సరైనదేనని 80 శాతం మంది మహిళలు భావిస్తున్నట్లు తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో వెల్లడైంది. అతనికి లైంగిక వ్యాధులు ఉంటే.. లేదా అతనికి మరో మహిళతో లైంగిక సంబంధం ఉంటే.. లేదా తాను అలసిపోతే, మూడ్‌లో లేకపోతే భర్తను శృంగారానికి దూరంగా ఉంచడం సరైనదేనని 80 శాతం మంది మహిళలు భావిస్తున్నారు. 


ఇదే విషయాన్ని 66 శాతం మంది పురుషులు కూడా అంగీకరించారు. మరో 6 శాతం మంది మహిళలు, 10 శాతం మంది పురుషులు ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదే సర్వేలో 44 శాతం మంది పురుషులు, 45 శాతం మంది స్త్రీలు భర్తలు భార్యలను కొట్టడం సరైన చర్యేనని అభిప్రాయపడటం గమనార్హం. హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలిసి తినడం ద్వారా ఆ వ్యాధి వ్యాపించదనే అవగాహన 45 శాతం మంది మహిళల్లో, 59 శాతం మంది పురుషుల్లో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 


Also Read: Gyanavapi masjid Dispute: ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం... జ్ఙానవాపి మసీదు వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు 


Also Read: సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు.. ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.