విశాఖ నేవీలో గూఢచర్యం కేసులో కీలక కుట్రదారు అరెస్ట్
విశాఖ నేవీలో హనీ ట్రాప్ ద్వారా గూఢచర్యానికి పాల్పడిన కేసులో కీలక కుట్రదారు మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలాను ఎన్ఐఏ బృందాలు ముంబైలో అరెస్ట్ చేశాయి. శుక్రవారం ముంబైలో అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ సందర్భంగా అతడి నివాసంలో సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు బృందాలకు భారీ మొత్తంలో డిజిటల్ యంత్రాల పరికరాలు, పత్రాలు లభ్యమయ్యాయి.
వైజాగ్ : విశాఖ నేవీలో హనీ ట్రాప్ ద్వారా గూఢచర్యానికి పాల్పడిన కేసులో కీలక కుట్రదారు మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలాను ఎన్ఐఏ బృందాలు ముంబైలో అరెస్ట్ చేశాయి. శుక్రవారం ముంబైలో అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ సందర్భంగా అతడి నివాసంలో సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు బృందాలకు భారీ మొత్తంలో డిజిటల్ యంత్రాల పరికరాలు, పత్రాలు లభ్యమయ్యాయి. వాటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌తో పాటు భారత్‌లో పలు చోట్ల ఉన్న పాకిస్తానీ ఏజెంట్స్ అంతర్జాతీయ స్థాయిలో చేస్తోన్న గూఢచర్యానికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. ( Also read : 19న తేలనున్న టెన్త్ ఎగ్జామ్స్ సస్పెన్స్ )
నేడు అరెస్ట్ అయిన మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలా అనేక పర్యాయాలు పాకిస్తాన్‌లోని కరాచికి వెళ్లి అక్కడ తనను నియమించిన వారితో సమావేశమైనట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కి చెందిన ఇద్దరు గూఢాచారులైన అక్బర్, రిజ్వాన్‌లను సైతం కలిశాడని.. వారి ఆదేశాల మేరకే విశాఖ నేవీలోని కొంతమంది అధికారుల బ్యాంకు ఖాతాల్లో అప్పుడప్పుడు నగదు జమ చేశాడని నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాతే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలాను అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ( Also read : మంత్రి హరీష్ రావు ఆగ్రహం )
గతేడాది డిసెంబర్‌లో విశాఖ నౌకాదళంలో గూఢచర్యం ఘటన వెలుగుచూసిన అనంతరం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ.. గూడఛర్యానికి పాల్పడుతున్న ముఠా గురించి అనేక వివరాలను రాబట్టింది. భారత్‌లో కొంతమందిని తమ ఏజెంట్స్‌గా నియమించుకున్న పాకిస్తాన్.. అక్కడి నుంచే మిగతా వ్యవహారాన్ని పూర్తి చేస్తున్నట్టు తేలింది. ( Also read : షాకింగ్: విశాఖలో మరిన్ని విష వాయువులు! )
పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ల ఆదేశాల మేరకు ఇండియాలో ఉన్న ఏజెంట్స్.. విశాఖ నేవీలోని అధికారులతో ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి ద్వారానే నేవీ రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఐఏ విచారణలో స్పష్టమైంది. ముఖ్యంగా నౌకాదళంలో భాగమైన నౌకలు, సబ్‌మెరైన్స్ కదలికలు, రహస్య స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసమే పాకిస్తాన్ రిక్రూట్ చేసుకున్న ఏజెంట్స్ ఈ కుట్రకు తెరతీసినట్టు విచారణలో తేలింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..