Night curfew in AP : ఏపీలో నైట్ కర్ఫ్యూ, అప్పటి నుంచే అమల్లోకి.. కోవిడ్ కొత్త ఆంక్షలు ఇవే!
Night curfew, Covid curbs in Andhra Pradesh : ఏపీలో నైట్ కర్ఫ్యూ, కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుంది. అలాగే పలు కరోనా ఆంక్షలు కూడా అమలులో ఉండున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగ జీవో జారీ చేసింది.
Night curfew, Covid curbs back in Andhra Pradesh, Government released GO : ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Government) కోవిడ్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ (Night curfew) అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) రాత్రి పూట కర్ఫ్యూ (Night curfew) అమలుచేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి జీవో (GO) మంగళవారం విడుదలైంది.
సంక్రాంతి తర్వాత నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. పండుగ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జనవరి 31 వ తేదీ వరకు (January 31st) నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అలాగే ఏపీలో కరోనా ఆంక్షలు (Corona restrictions in AP) కూడా అమల్లో ఉండనున్నాయి.
మాస్కు (Mask) తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భౌతిక దూరం పాటించాలని ఏపీ గవర్నమెంట్ సూచించింది. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా (fine) విధిస్తామని తాజా ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం (AP Government) పేర్కొంది. అలాగే షాపింగ్ మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 10 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
Also Read : Delhi New Rules: ఢిల్లీలో ఇక నుంచి ప్రైవేటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి
వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు.. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్‌లలో (Indoor) అయితే 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం కెపాసిటీతో థియేటర్లను (theaters) నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులకు మాస్క్ తప్పనిసరి చేయాలని ఏపీ సర్కార్ పేర్కొంది.అయితే కొన్ని సడలింపులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. నిత్యావసర వస్తువులు, అత్యవసర చికిత్స వంటి వాటికి మినహాయింపు ఉంటుంది. అలాగే హాస్పిటల్స్, ఫార్మసీ షాప్స్, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్స్, ఐటీ, విద్యుత్ సర్వీసెస్, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డాకర్లు, వైద్సియ బ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతి (sankranthi) దృష్ట్యా అంతరాష్ట్ర రవాణాకు ఏపీ ప్రభుత్వం (AP Government) అనుమతి ఇచ్చింది. ప్రజా రవాణాలో ప్రయాణికులకు, సిబ్బందికి మాస్క్ తప్పనిసరి అని గవర్నమెంట్ సూచించింది.
Also Read : Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టులో వింటేజ్ కోహ్లీని చూస్తారు: హర్భజన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి