కాంగ్రెస్ తో దోస్తీ కోసం చంద్రబాబు ప్రయ్నతిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి యనమల స్పందించారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ఆహ్వానం మేరకే చంద్రబాబు వెళ్లారన్నారు.. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ పిలిస్తే చంద్రబాబు వెళ్లారనడం సత్యదూరమని యనమల వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో దోస్తీ ఉండబోదని యనమల తేల్చిచెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీదే కీలక పాత్ర


ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ బెంగళరూలో చంద్రబాబు ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు వామపక్షాలతో భేటీ అయ్యారని వెల్లడించారు. అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని.. ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 


బీజేపీతో వైసీపీ దోస్తీ


బీజేపీతో దోస్తీ కోసమే కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష నేత జగన్ వెళ్లలేదని ఆరోపించారు. కర్నాటకలో గాలి సోదరులతో జతకట్టిన బీజేపీ ..ఏపీలో జగన్ తో దోస్తీ చేయాలని భావిస్తోందన్నారు. అందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని మంత్రి యనమల ఆరోపించారు.