ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు పొడగిస్తారా.. మంత్రి ఆదిమూలపు సురేష్ రియాక్షన్ ఇదే..
Minister Adimulapu Suresh Comments: తెలంగాణలో సెలవులు పొడగించిన నేపథ్యంలో ఏపీలోనూ సెలవులను పొడగించవచ్చుననే ప్రచారం జరిగింది. మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది.
Minister Adimulapu Suresh Comments: ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు పొడగించే ఆలోచన లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) స్పష్టం చేశారు. ఆదివారం (జనవరి 16) గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సెలవులపై స్పష్టతనిచ్చారు. తెలంగాణలో సెలవులు పొడగించిన నేపథ్యంలో ఏపీలోనూ సెలవులను పొడగించవచ్చుననే ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది.
సంక్రాంతి పండగ (Sankranti 2022) సందర్భంగా ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవుల పొడగింపు లేకపోవడంతో రేపటి (జనవరి 17) నుంచి యథావిధిగా విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం సెలవులను పొడగించవచ్చునని విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు. కానీ అలాంటి ఆలోచేదీ లేదని మంత్రి స్పష్టతనిచ్చేశారు.
కరోనా కేసుల విషయానికొస్తే.. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం (జనవరి 15) రాష్ట్రంలో 4,955 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ (జనవరి 17) 4570 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఒకరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,03,385కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 669 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,71,202 కరోనా కొత్త కేసులు (Covid 19 cases in India) నమోదయ్యాయి. కరోనాతో మరో 314 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.71 కోట్లకు చేరింది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,86,066కి చేరింది.
Also Read: Vaccination drive India: దేశంలో టీకా ప్రక్రియకు ఏడాది- ప్రధాని మోదీ ఏమన్నారంటే..
Also Read: Baahubali Thali Prize Money: ఈ బాహుబలి మీల్స్ తింటే.. రూ 8 లక్షల ప్రైజ్ మనీ మీ సొంతం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook