ఎర్రకోట ఒక్కటే కాదు.. దత్తతకు మరెన్నో వారసత్వ కట్టడాలు!
వారసత్వ కట్టడాల దత్తతపై కేంద్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు.
వారసత్వ కట్టడాల దత్తతపై కేంద్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎర్రకోటలాగే తాజ్‌మహల్, చార్మినార్, గోల్కొండ.. ఇలా 98 చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాలను కార్పోరేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. 'సామాజిక బాధ్యత'గా ఐదేళ్ల పాటు అభివృద్ధి చేసి నిర్వహిస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని అప్పగిస్తోంది. పర్యాటక శాఖ, కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు విభాగం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఒకేసారి ఈ 98 కట్టడాలను అప్పగించడం లేదని సమాచారం. మొత్తం నాలుగు దశల్లో దేశవ్యాప్తంగా వీటిని అప్పగించనున్నారని, ఇప్పటికే ఆయా సంస్థలను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కట్టడాలు - దత్తత తీసుకోనున్న సంస్థలు
- తాజ్ మహల్(యుపీ)- ఐటీసీ లిమిటెడ్, జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రవేట్ లిమిటెడ్
- జంతర్ మంతర్(ఢిల్లీ)- ఎస్‌బీఐ ఫౌండేషన్
- సూర్య దేవాలయం(కోణార్క్) - టీకే ఇంటర్నేషనల్ లిమిటెడ్
- అజంతా గుహలు(మహారాష్ట్ర) - యాత్రా ఆన్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్
- ఖజురహో దేవాలయాలు- జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
- ఎలిఫంటా గుహలు(మహారాష్ట్ర) - దృష్టి లైఫ్‌సేవింగ్ ప్రైవేట్ లిమిటెడ్
- మహాబోధి దేవాలయం(బీహార్) - ఎస్ బ్యాంకు
- సాంచీ స్థూపం(మధ్య ప్రదేశ్) - ఎస్ బ్యాంకు
తెలుగు రాష్రాల జాబితా విషయానికి వస్తే..
తెలంగాణలో:
- చార్మినార్- ఐటీసీ హోటల్స్
- గోల్కొండ కోట- జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
- రామప్ప దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా - జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
- రామప్ప దేవాలయం, పాలం పేట- కాకతీయ హెరిటేజ్ ట్రస్టు
ఏపీలో:
- రాక్-కట్ హిందూ దేవాలయం, ఉండవల్లి గుహలు - ఐటీసీ హోటల్స్
- రాక్-కట్ హిందూ దేవాలయం, గుంటూరు - జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
- గండికోట ఫోర్ట్, కడప- దాల్మియా భారత్