టీడీపీ వ్యవస్థాపకుడు, దిగంగత నేత ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  ఏపీ  రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ గల్లా జయదేవ్‌, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ స్పూర్తి ప్రధాత...
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలంలో టీడీపీ జెండా ఎగురవేసిన చంద్రబాబు ...ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి, వ్యవస్థ. సమాజానికి సేవ చేయాలి... మార్పు తేవాలనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఎదురుదెబ్బలు తిన్నా ఎన్టీఆర్‌ మనోధైర్యం కోల్పోలేదు. అదే స్ఫూర్తితో నిర్మాణాత్మక మనం ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అంటూ కార్యకర్తల్లో మనోధైన్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.  


హామీలు అమలు చేయకుంటే ఖబర్దార్...
ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు స్పందిస్తూ  కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత సమయం ఇవ్వాలి.. వారు కొన్ని హామీలు ఇచ్చారు. దాని ఎలా అమలు చేస్తారో చేయనిద్దాం.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే  బాధ్యత గల ప్రతిపక్షంగా వారిని నిలదీద్దాం అంటూ చంద్రబాబు  కార్యకర్తలకు మర్గనిర్దేశం చేశారు . ఇకపై ప్రతిరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కనీసం 3 గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.