COVID-19 vaccine jab: తిరుపతి SVRR Medical college లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న నర్సింగ్ విద్యార్థులలో ఏడుగురు అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం తిరుపతిలో చోటుచేసుకుంది. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుని అస్వస్థతకు గురైన వారిలో ఏడుగురు GNM students తో పాటు ఒకరు పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిని రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా టీకా తీసుకున్న వారిలో పలువురు ఇలా అస్వస్థతకు గురవడం అక్కడి స్థానికులను ఆందోళనకు గురయ్యేలాచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతిలో COVID-19 vaccine తీసుకున్న విద్యార్థులు, ఒక పారిశుద్ధ్య కార్మికురాలు అనారోగ్యం బారిన పడ్డారని తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ ఘటనపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి సమాచారం అందించాలని మంత్రి ఆళ్ల నాని అక్కడి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 


Also read : COVID-19 vaccine jab: ఇక పోలీస్, మున్సిపల్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్


బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఈ.బి. దేవి మాట్లాడుతూ.. COVID-19 vaccine తీసుకున్న వారిలో పలువురికి vomiting, headache తో పాటు పలు ఇతర లక్షణాలు కనిపించాయని.. చికిత్స అనంతరం ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook