AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటివరకు 278 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు. 1000 మందికిపై పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ రైలు ప్రమాదలో ఏపీ వాసులు కూడా చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల వివరాలను సేకరించింది. విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన బృందాన్ని ఒడిశాకు సీఎం పంపించారని తెలిపారు. కోరమాండల్‌ సహా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఏపీలో ఈ రైళ్లు ఆగే ఆయా స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామని.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామన్నారు.


"వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో 31, ఏలూరులో ఐదుగురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారు. అందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లు చేసి వారిని ట్రేస్‌ చేస్తున్నాం.. ఇప్పటివరకు 267 మంది సురక్షితంగా ఉన్నారని తేలింది. 20 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో.. లేదా స్విచాఫ్‌ అని వస్తోంది. వీరందరి వివరాలు సేకరించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాం.


హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీం నుంచి 89 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వైజాగ్‌లో 33 మంది, రాజమండ్రిలో ముగ్గురు, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ 41, బాపట్లలో 8, నెల్లూరు నుంచి ముగ్గురు ఉన్నారు. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 10 మంది ట్రైను ఎక్కలేదని తేలింది. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో.. లేదా స్విచాఫ్‌ అవడమో జరిగింది. ఈ 28 మంది వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టాం.." అని మంత్రి బొత్స తెలిపారు.  


Also Read: Coromandel Express train Tragedy: 14 ఏళ్ల క్రితం కూడా ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి యాక్సిడెంట్


ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకూ అన్ని ఆస్పత్రులను అలర్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. గాయపడిన వారు ఎవరు వచ్చినా చికిత్స అందిస్తామన్నారు. విశాఖకు చేరుకున్న గాయపడిన ఇద్దరు ప్రయాణికులను వెంటనే సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ఒడిశాకు అంబులెన్స్‌లే పంపడమే కాకుండా.. ఎమర్జెన్సీ కార్యకలాపాలకోసం ఒక ఛాపర్‌ను కూడా సిద్ధం చేశామన్నారు. అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేస్తామన్నారు. ఇందుకోసం నేవీ సహకారాం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు చనిపోయినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఇప్పుడే ఏం చెప్పలేమని బొత్స సత్యనారాయణ తెలిపారు. 


Also Read: Odisha Train Accident Latest Updates: రైలు ప్రమాదంలో మరణించిన వారికి 35 పైసల బీమా వర్తిస్తుందా..? ఎంత డబ్బు వస్తుంది..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి