Posani Krishna Murali: రిపబ్లిక్‌ మూవీ ప్రీ -రిలీజ్‌ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు పెను దూమారమే రేపుతున్నాయి. దీంతో ఆయన కామెంట్స్‌ను తప్పుబడుతూ సీనియర్‌ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ నిన్న మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు పోసాని.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోసాని(Posani Krishna Murali) మాట్లాడుతూ...రాజకీయాల్లో ఆరోపణలు చేయడం సహజమేనని, గతంలో పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తిట్టారని, అలాగే కేసీఆర్‌(KCR) కూడా పవన్‌ను తిట్టారన్నారు. మరి అప్పుడు ఫ్యాన్స్‌ ఎందుకు స్పందించలేదన్నారు. అలాగే పవన్‌ వ్యక్తిగతంగా దూషించడం కరెక్టా? అని ప్రశ్నించారు. పార్టీ పెట్టకముందు నుంచే తాను సీఎం జగన్‌(CM Jagan) ఫ్యాన్‌ అని అందుకే ఫ్యాన్స్‌లాగే తాను రియాక్ట్‌ అయ్యానని ఆయన అన్నారు.


Also Read: Mohan Babu: MAA ఎన్నికల తర్వాత నీ ప్రశ్నలకు జవాబిస్తా 'పవన్'..ముందు విష్ణుకు ఓటేసి గెలిపించు..


‘పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా(Social Media) వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్‌(Comments) చేస్తున్నారని పోసాని ఆరోపించారు. నిన్న ప్రెస్‌మీట్‌ నిర్వహించినప్పటి నుంచి నాకు వేలల్లో బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. నన్ను బూతులు తిడుతూ పవన్‌ ఫ్యాన్స్‌(Pawan Fans) పోస్టులు పెడుతున్నారని వాపోయారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook