పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు లోక్ సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే  స్పీకర్ సుమిత్రా మహాజన్ కొత్తగా ఎంపికైన ఎంపీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో తాము లేవనెత్తిన సమస్యలపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. క్వశ్చన్ అవర్ తర్వాత చర్చిద్దామని విపక్ష సభ్యులతో స్పీకర్ వారించినప్పటికీ సభ్యులు వినకపోవడంతో ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా రాజ్యసభలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళనకు దిగడంతో  ఛైర్మన్ సభను వాయిదా వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవిశ్వాసంపై చర్చించాల్సిందే


విభజన హామీలపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటిసు ఇచ్చాయి. దీనిపై చర్చించాలని టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టాయి. సభలో నినాదాలు చేశారు. ఆర్డర్ ప్రకారం సమస్యలపై చర్చిద్దామని స్పీకర్ చెప్పినప్పటికీ సభ్యులు ఆందోళన విరమించలేదు. విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.