Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇసుక కొరత వల్ల తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని, తమ కోసం పోరాడేందుకు ముందుకు రావాలని భవన నిర్మాణ కార్మికులు ముగ్గురు మంగళగిరిలో నన్ను కలిసేందుకు వచ్చిన క్షణాలు నాకింకా గుర్తే. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కోసం నేను కదిలితే, నాకు లక్షలాదిగా ఎదురొచ్చి మద్దతు తెలియజేసింది విశాఖ నగరమే. మళ్లీ ప్రజల కోసమే నా పోరాటం అని తెలియజెప్పిన విశాఖ నగరం అంటే ఇప్పటికీ అమితమైన ఇష్టం. నన్ను గుండెల్లో పెట్టుకున్న ఇక్కడి ప్రజల చైతన్యం చాలా గొప్పది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాకు నటనలో పాఠాలు నేర్పి, మీ అందరికీ దగ్గర చేసిన విశాఖ నగరం నాకు అన్నం పెట్టిన నేల. జగదాంబ జంక్షన్ లో 25 ఏళ్ల క్రితం సుస్వాగతం సినిమా కోసం బస్సు మీద ఎక్కి డాన్స్ చేసినపుడు సిగ్గుతో ఉన్న నాకు, అదే జగదాంబ జంక్షన్ లో మళ్లీ లక్షలాది మంది జనం సాక్షిగా రాజకీయ ప్రసంగం ఇచ్చిన ప్రాంతం ఇది. ఉత్తరాంధ్ర మాండలీకం, సంస్కృతి మీద గౌరవం కలిగించిన విశాఖకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. విశాఖ నుంచి వైసీపీని పూర్తిగా విముక్తం చేసే వరకు మనం కలిసికట్టుగా పోరాడుతాం. మళ్లీ ప్రశాంత విశాఖను అంతే అందంగా సాధించుకుందాం.


విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు... రూ. 25వేల కోట్లు అప్పు
కరెంటు బిల్లులతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. 8 రకాల అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు రూ. 253 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ. 513 పెరిగిపోయింది. వైసీపీకి ఓటు వేసిన పాపానికి చెత్త పన్ను కట్టాల్సి వస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి.. రూ. 25 వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు వైజాగ్ నగరంలోని రూ. వేల కోట్ల విలువైన 128.70 ఎకరాల ప్రభుత్వ భూములు, భవనాలు, ఖాళీ స్థలాలను వివిధ బ్యాంకులకు తాకట్టు పెట్టారు.  ప్రభుత్వ ఆస్తులను పెంచాల్సిన ముఖ్యమంత్రి ... వాటిని తాకట్టు పెట్టి వేలకోట్లు తీసుకొచ్చి దోచుకుంటున్నారు. ప్రకృతి వనరులు, ప్రజాధనం దోచుకుంటున్న ప్రతి వైసీపీ నాయకుడి చిట్టా కేంద్రం దగ్గర ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి బాగోతం బయటకు వస్తుంది... అప్పుడు ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష పడుతుంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 
ఇది కూడా చదవండి : 
Pawan Kalyan Slams Jagan: జగన్ ఆంధ్రా వీరప్పన్.. పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు    
పరిశ్రమల పేరు చెప్పి ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డుగా మార్చేశారు. పారిశ్రామిక కాలుష్యంతో జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆడబిడ్డలకు గర్భ కోశ వ్యాధులు వస్తున్నాయి. పీల్చే గాలి కలుషితం అయిపోతే వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఆలోచించి ఓటు వేయకపోతే మనమే నష్టపోతాం. విశాఖ సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మారిందని, ల్యాండ్, మైనింగ్, కల్తీ మందుల వ్యాపారం ఎక్కువైపోయాయని సాక్షాత్తూ దేశ హోంమంత్రి అమిత్ షా చెప్పారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాన్ని బయటకు తీస్తాం. దోషులను ప్రజక్షేత్రంలో నిలబెట్టి తీరుతాం అని ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan Varahi Yatra: మూడో విడత వారాహి యాత్రకు శ్రీకారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి