చంద్రబాబు దోస్తీ అస్త్రంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయ నేతలు చెబుతున్నట్లుగా తాము ఎవరితోనూ దోస్తీ చేయబోమని.. వాపపక్షాలు తప్పితే ఎవరితోనూ జతకట్టే పరిస్థితి ఉండదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వామపక్షాల కలిసి రాని పక్షంలో ఒంటరిగా  ఏపీలోని 175 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యువత భవిష్యత్తు కోసం..


పవన్ మాటల్లో చెప్పాలంటే  ‘‘175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం... వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ కలిసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి’ అని  పవన్‌ పేర్కొన్నారు.


ఇది జనసేనపై కుట్ర


జనాలతో పాటు పార్టీ కార్యకర్తలను కన్ఫూస్ చేసేందుకే రాజకీయ పార్టీ సరికొత్త ఎత్తుగడ వేస్తున్నాయని..ఈ కుట్రలో భాగంగానే జసనేన పార్టీతో ఇతర పార్టీలకు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. ఇలాంటి పుకార్ల నమ్మువద్దని ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు.


చంద్రబాబు వ్యాఖ్యలకు సమాధానం


ఇటివలె శ్రేతపత్రం విడుదల సందర్భంలో తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ... టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే జగన్‌కు వచ్చిన నొప్పి ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై నేను మాట్లాడనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన దోస్తీ పుకార్లు పెద్ద ఎత్తున వినిపించాయి. మీడియాలో దీనిపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పవన్ కల్యాణ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.