Pawan Kalyan deep condolences on his fans death: అభిమాన నటుడు, నాయకుడి జన్మదిన వేడుకలను (Pawan Kalyan birthday celebrations ) ఉదయాన్నే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావించారు.. కానీ వారిని కరెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పుం సమీపంలోని శాంతిపురంలో తీవ్ర విషాదం అలుముకుంది. నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకోని.. శాంతిపురం వద్ద 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు యువకులు మరణించగా ( fans death).. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గుండెల నిండా అభిమానం నింపుకున్న జనసైనికులు మరణించడం మాటలకందని విషాదమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటనను విడుదల చేశారు. Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి



సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్ర విద్యుత్ షాక్‌తో చనిపోయారన్న వార్త తన మనసును కలిచివేసిందనన్నారు. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక వారి తల్లితండ్రులకు తానే ఒక బిడ్డగా నిలుస్తానని, వారి కుటుంబాలను ఆదుకుంటానని తెలిపారు. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతోపాటు గాయపడిన మరో నలుగురు అభిమానులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులను ఆదేశించారు పవన్ కల్యాణ్. Pawan Kalyan birthday: ఫ్యాన్స్ తన బర్త్ డే జరుపుకోవడం గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..