Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కొత్త డిమాండ్​ తెరమీదకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్​లోని ఓ జిల్లాకు పేరు మార్చాలని డిమాండ్ చేశారు. అధికార మార్పిడి తర్వాత జనసేన(Janasena) ఆ జిల్లా పేరును మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా(Kurnool district)కు దామోదరం సంజీవయ్య (damodaram sanjivayya) పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. వైకాపా పట్టించుకోకపోతే.. అధికార మార్పిడి తర్వాత జనసేన ఆ ప్రక్రియ మెుదలు పెడుతుందని వెల్లడించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సంజీవయ్య అని పేర్కొన్న పవన్ (Pawan Kalyan).. ఆయన పేరు ఒక్క  పథకానికీ పెట్టలేదని విమర్శించారు. 


Also Read: Paritala Sunitha: మాది సీమ రక్తమే..రక్తం ఉడుకుతోంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు


కర్నూలు జిల్లాలో ఉన్న దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయన తెలియజేశారు. ఇందుకోసం రూ.కోటి నిధి ఏర్పాటు చేయనున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook