Pawan Kalyan Pen: ఎట్టేకేలకు 2009 నుంచి ఎదురు చూసిన రోజు పవన్ కళ్యాణ్ చెంతకు చేరింది. ప్రజా రాజ్యంలో యువరాజ్యం అధినేతగా రాజకీయ అరంగేట్రం చేసారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. 2014లో పవన్ కళ్యాణ్ అన్నను విభేదించి సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. అటు 2019లో బీజేపీ, తెలుగు దేశం పార్టీలను విభేదించి సొంతంగా బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎలక్షన్స్ లో  పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నుంచి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కేవలం జనసేన పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే వైసీపీ అనుబంధంగా మారిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కట్ చేస్తే 2024లో వైసీపీ అధినేత జగన్ ను గద్దే దించడమే లక్ష్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఏపీలో తెలుగు దేశం పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగారు. అంతేకాదు తాను అనుకున్నట్టే కూటమి ఏపీలో ప్రభంజం సృష్టించింది. ఇక జనసేన కూటమి కోసం తక్కువ సీట్లలో పోటీ చేసింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది.


అంతేకాదు చంద్రబాబు మంత్రి వర్గంలో మూడు మంత్రి పదవులను తీసుకున్నారు. పవన్ కళ్యాణ్.. బాబు క్యాబినేట్ లో పవన్ కళ్యాణ్.. పంచాయితీ రాజ్, పర్యావరణం, పర్యాటకం సహా పలు శాఖల మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిగా సంతకాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కు ఆయన వదినమ్మ సురేఖ.. ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. ఈ పెన్ను డిస్నీ వెర్షన్ పెన్ కాగా.. ఇది ఏకంగా 2 లక్షల 53 వేలకు పైగా ఉంటుందని సమాచారం. తాజాగా చిరంజీవి భార్య సురేఖ గారు.. పవన్ కళ్యాణ్ కు ఈ పెన్ను బహుమతిగా ఇవ్వడంతో ఈ పెన్ను రేటు ఇపుడు వైరల్ గా మారింది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter