Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జీ తెలుగు న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్ తన పొలిటికల్, అండ్ పర్సనల్ లైఫ్ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)కు జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఈ సారి ఎలక్షన్స్‌లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాననే ధీమాతో ఉన్నారు జనసేనాని. ఈ సందర్భంగా తన పిల్లలైన అకీరా, ఆద్యాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను జీ న్యూస్ తెలుగు సీఈవో కమ్ ఛీఫ్ ఎడిటర్ భరత్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు.. అంతే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జీ తెలుగు సీఈవో.. మీరు సినిమాల్లో సంపాదించినదాన్ని రాజకీయాల్లో ఖర్చుపెడుతున్నారు. మీ సంపాదనను ఇలా ఖర్చ పెట్టడాన్ని మీ ఫ్యామిలీ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయారా.. ముఖ్యంగా అకీరా ఇలా ఖర్చు పెట్టడాన్ని అబ్జెక్ట్ చేయరా అనే విషయమై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
పాపం నా పిల్లకేమి తెలియదు. ఒక నగరంలో ఉండే సగటు ఉద్యోగి తమ పిల్లలను ఎలా పెంచుతారో మేము మా పిల్లలను అలాగే పెంచాము. నేను వాళ్లకు ఇచ్చేది చదవు మాత్రమే. మాములుగా ఏదైనా ఉంటే సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇవ్వగలను. నా భార్య పిల్లలకు నా ఇల్లు రాసిచ్చేసాను. వారి పేర్ల మీద ఉన్న ప్రాపర్టీని.. ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ఇచ్చేసాను. ఏ తండ్రైనా ఎంత వరకు చేయగలడో అంత వరకు నా పిల్లలకు అంత చేసాను. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామనేది కాదు. వాళ్లు ఎంత వరకు నిలబెట్టుకున్నారనేది ముఖ్యం. నా నాన్న గారు నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు. ధైర్యం మాత్రం ఇచ్చారు. అన్నయ్య నుంచి స్కిల్స్ నేర్చుకున్నాను. భవిష్యత్తులో ఎవరిపై ఆధారపడకుండా.. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇచ్చాను. నేను ప్రతి రోజు చివరి రోజులా బ్రతుతాను. రేపు ఏం జరగుతుందనే విషయం ఎవరికీ తెలుసు ఒకింత ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ స్థిరత్వం కోసమే బీజేపీ, టీడీపీతో జతకట్టిన విషయాన్ని ప్రస్తావించారు జనసేనాని. వై.యస్. జగన్ పరిపాలనంతా రివర్స్ టెండరింగ్, పాలసీ టెర్రరిజమని విమర్శించారు. ఒక్కోసారి వైసీపీ వాళ్ల మాటలకు ఒక్కొసారి చెప్పు చూపించాలని అనిపిస్తుందన్నారు. కూటమి విజయం ఖాయమని.. భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తనకు సీఎం కూర్చీపై ఆశ లేదన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. సుజిత్‌తో ఓజీ సినిమాతో పాటు.. క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' రెండు పార్టులతో పాటు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలున్నాయి. మరి ఎన్నికల అయిపోయాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తన దృష్టి సినిమాలపై కేంద్రీకరిస్తాడా ? లేదా అనేది చూడాలి.
Also read: Mamata Banerjee: మరో బాంబ్ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter