Pawan Kalyan Touches Chiranjeevi Feet: ఎన్నికల్లో అద్భుత విజయం పొందిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ హాజరైన తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు. అంతకుముందు కుటుంబసభ్యులతో పవన్‌ ఆత్మీయంగా మాట్లాడారు. చిరంజీవి, వదిన సురేఖ, రామ్‌ చరణ్‌ తదితరులతో పవన్‌ సరదాగా కనిపించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu Oath: ప్రమాణస్వీకారంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుంది.. చంద్రబాబు అనే నేను


గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద బుధవారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా పవన్‌ ప్రమాణం చేశారు. పవన్‌ ప్రమాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కేకలు, అరుపులు హోరున వినిపించాయి. పవర్‌ స్టార్‌.. జై పవన్‌ అంటూ నినాదాలు చేశారు.

Also Read: Chandrababu Oath: పండుగలా బాబు ప్రమాణం.. షా, చిరు, రజనీకాంత్‌ రాక.. వరుస కట్టిన ప్రముఖులు


ప్రమాణం చేసిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపి అనంతరం వేదికపై ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వందనం చేశారు. అనంతరం సూపర్‌ స్టార్‌ రజీనీకాంత్‌, ఆయన సతీమణికి, బాలకృష్ణకు పవన్‌ నమస్కరించాడు. తిరిగి వస్తూ వెంటనే చిరంజీవికి పవన్‌ కల్యాణ్‌ పాదాభివందనం చేశాడు. చిరంజీవికి కాళ్లు మొక్కడంతో సభికులంతా చప్పట్లతో మార్మోగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌లోని తమ నివాసానికి వచ్చిన సమయంలో కూడా చిరంజీవి కాళ్లు పవన్‌ మొక్కాడు. తన వదిన సురేఖ, తల్లి అంజనా దేవి తదితరులకు పవన్‌ పాదాభివందనం చేసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం కూడా తన సోదరుడికి వందనం చేయడం ఆకట్టుకుంది.


ప్రధాని మోదీ అభినందన
ఇక మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను వేదిక ముందుకు తీసుకువచ్చి ప్రధాని మోదీ ఇద్దరినీ అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్‌పై మోదీ ప్రశంసలు కురిపిస్తుండడంతో చిరంజీవి ఒక విధమైన ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ బుగ్గలు నిమురుతూ చిరంజీవి అమితానందం వ్యక్తం చేశారు. పవన్‌, చిరుతో కలిసి ప్రధాని మోదీ సభపైనే చేతులు జోడించి అభివాదం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ సన్నివేశం మరింత ఆకర్షణీయంగా మిగిలింది. వారిద్దరినీ మోదీ ప్రశంసల్లో ముంచెత్తడంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు.



 


 






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook