భూకబ్జాలకు పాల్పడితే ఖబర్దార్ ; టీడీపీ నేతలకు పవన్ వార్నింగ్
విశాఖలో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ నగరంలోని భూకబ్జాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని విమర్శించారు.
ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని పిచ్చిపిచ్చి వేషాలు వేయకండి..ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని సూచించారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే... చేతులు కట్టుకుని కూర్చోబోమని పవన్ టీడీపీ నేతలకు హెచ్చరించారు.
రాజకీయ నిర్ణయాలపైనే ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని.. వారు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చన్నారు. అన్నింటికీ తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని... పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు.