టాలీవుడ్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్ !!
సినిమాలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగేందుకు జనసేన చీఫ్ మొగ్గు చూపుతున్నారు
తన టాలీవుడ్ రీ ఎంట్రీపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తన ఫోకస్ మొత్తం పార్టీని బలోపేతం చేయడంపైనే ఉందని...సినిమాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదని తేల్చేశారు. జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు బాగా క్లోజ్ గా ఉండే కొంతమంది నిర్మాతలు సినిమాల్లో నటించమని అడుగుతున్నారని... ప్రస్తుతం కొత్త ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి.. కొంత సమయం కేటాయించి ఓ రెండు సినిమాలు చేయమని ప్రతిపాదించరని..అయితే దానికి తాను ఒప్పకోలేదని పవన్ కల్యాణ్ తెలిపారు
రీ ఎంట్రీ రూమర్స్ కు కారణం ఇదే..
ఎన్నికల నామినేషమన్ సమయంలో పవన్ కల్యాణ్... తన వద్ద సినిమాలకు సంబంధించి ఇప్పటికీ కొన్ని అడ్వాన్సులు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించారు. దీంతో ఎన్నికల తర్వాత పవన్ మరోసారి సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలకు పవన్ కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఇక సోషల్ మీయియాలో పవన్ టాలీవుడ్ రీఎంట్రీ అంటూ వార్తలు తెగ హల్ చల్ చేశారు. పవన్ కల్యాణ్ మరోసారి కెమెరా ముందుకొస్తారని... మంచి కథతో రీఎంట్రీ ఇస్తారని గాసిప్స్ ఊపందుకున్నాయి.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన రీ ఎంట్రీపై ఇలా క్లారిటీ ఇచ్చేశారు.. సో ఇపట్లో పవన్ కు సినిమాల్లో నటించే ఆసక్తి లేదన్నమాట.