Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. పొత్తులపై మొదటగా ప్రస్తావించి కాక రాజేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. పొత్తులపై బీజేపీ, వైసీపీ,టీడీపీ నేతలు భిన్నవాదనలు చేస్తున్న సమయంలో పవన్ చేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది. జనసేన కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ గబ్బర్ సింగ్ చేసిన ఈ ట్వీట్.. ఏపీలో కొత్త చర్చకు దారీ తీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జర భద్రం.. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ మాటలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు కొట్టవద్దన్నారు. ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే అన్నారు పవన్ కల్యాణ్. ఇప్పటివరకు తిట్టిన నేతలు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలని పవన్ సూచించారు. పొగుడుతున్నారు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి.. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి అంటూ పవన్ కల్యాణ్ తన ట్విట్ లో కామెంట్ చేశారు.


వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమంటూ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో పొత్తుల అంశం హాట్ హాట్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పవన్ కామెంట్లను సమర్ధించే మాట్లాడటంతో పొత్తులు ఖాయమనే ప్రచారం జరిగింది. టీడీపీ నేతలు కొందరు జనసేనతో పొత్తు ఉంటుందని ఓపెన్ గానే కామెంట్ చేశారు. 2014 తరహాలోనే మూడు పార్టీల కూటమి ఉంటుందనే టాక్ వచ్చింది. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ చర్చలు సాగుతుండగానే... పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే పొత్తులకు సిద్ధమంటూ జనసేన కార్యకర్తలు ప్రకటించడం సంచలనమైంది. జనసేన తాజా ప్రతిపాదనపై బీజేపీ నేతలు స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించబోమని చెప్పారు. టీడీపీ నేతలు మాత్రం స్పందించలేదు. సీఎం పదవిని త్యాగం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ చేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది.


READ ALSO: CM Jagan on 2024 Elections: మళ్లీ మన ప్రభుత్వే రాబోయేది..నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం..!


READ ALSO: TSRTC Hikes Diesel Cess: భారీగా డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook