Pawan Kalyan on Alliance With TDP and BJP: వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రభుత్వం సహజ వనరులను దోచుకుందని ఆరోపించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో సహజ వనరుల దోపీడికి బాద్యులైన వారు ఎవ్వరైనా వారిని తాము వదిలిపెట్టబోమని అన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న పవన్ కళ్యాణ్.. వచ్చేది జనసేన ప్రభుత్వమా, జనసేన టిడిపి కలిసిన ప్రభుత్వమా లేక బీజెపి జనసేన ప్రభుత్వమా అనేది ముఖ్యం కాదని.. ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సహజ వనరులను దోచుకున్న వారిని మాత్రం వదిలిపెట్టం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించే క్రమంలో తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎవరితోనైనా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ కళ్యాణ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఆయన ఆలోచనా విధానాన్ని, ఆయన మనసులో ఏముంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి.


తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ నేతలంతా తరచుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపైనే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పరోక్షంగా వారి విమర్శలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నారని అర్థం అవుతోంది. 


ఇది కూడా చదవండి : Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే


ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా కోసం తాను గొంతు ఎత్తాను కానీ ప్రజలు అంత రియాక్ట్ అవ్వలేదన్నారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలి. రాష్ట్రంలో భారీ సంఖ్యలో యువతులు అదృశ్యం ఐతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులు  దోచుకుంటున్నారు. ఇలా నేరాలు, వనరులో దోపిడి వంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని చూస్తే వైసీపీ పాలన కంటే టిడిపి పాలన మంచిది అనిపించింది అని పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. నేటితో విశాఖ పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్.. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.


ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి