పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి విస్తరణ వరకు అన్నయ్య చిరంజీవికి భిన్నంగా  వ్యహరిస్తూ వచ్చారు పవన్ కల్యాణ్. చిరంజీవి ఒకేసారి పార్టీ ప్రకటించి ఎన్నికల క్షేత్రంలో వెళ్లగా..అందుకు  భిన్నంగా పవన్ ఒక్కో అడుగువేసుకుంటూ పార్టీని విస్తరిస్తున్నారు . అన్న చిరంజీవి ఒకే సారి సీఎం కూర్చిని టార్గెట్ చేయగా..తమ్ముడు మాత్రం కింగ్ మేకర్ గా అవతరించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా అన్నయ్య విషయంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా పవన్ జాగ్రత్తగా వ్యహరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా అన్ని విషయాల్లో అన్నయ్య చిరంజీవికి భిన్నంగా వ్యహరిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్ ఒక్క విషయంలో మాత్రం అన్నయ్య విధానాన్ని అనుసరిస్తున్నారు. చిరంజీవి తరహాలోనే పవన్ కూడా రెండు అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని పవన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరంరజీవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరు గెలుపొందారు. ఇక పవన్ విషయానికి వస్తే విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది.