Pawan Kalyan: అపుడు చిరంజీవి.. ఇపుడు పవన్ కళ్యాణ్.. సేమ్ సీన్ రిపీట్..
Pawan Kalyan: మెగా కుటుంబంలో చాలా యేళ్ల తర్వాత ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. అంతేకాదు వరుసగా వారి కుటుంబాలకు అన్ని శుభవార్తలే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో చిరంజీవి.. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
Pawan Kalyan: 2024 ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలగు దేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేసిన అధికారంలో ఉన్న వైయస్ఆర్సీపీని చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ ఎన్నికల్లో కూటమి 164 సీట్లు గెలిచి సంచలన రేపింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 135 సీట్లలో విజయం సాధించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరికాసేట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయ బోతున్నారు. అంతేకాదు మొత్తంగా పవన్ తో కలిపి 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత మంత్రి అయిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేసారు.
ఒక ఇంట్లో ఇద్దరు బడా హీరోలు పార్టీలు పెట్టడం అనేది మాములు విషయం కాదు. 2008లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి మొత్తంగా 18 సీట్లను గెలిచారు. అంతేకాదు 18 శాతం ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో ఏపీలో 13 సీట్లు.. రాయలసీమలో మూడు.. తెలంగాణలో రెండు సీట్లను సాధించి సంచలనం రేపింది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ సహా మెగాభిమానులు తీవ్ర నిరాశకు లోనైయ్యారు.
పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత 2012లో చిరంజీవి.. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత అదే యేడాదిలో చిరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో స్వతంత్య్ర హోదాలో పర్యాటక శాఖను నిర్వహించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్ గా ప్రచారం చేసినా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను గెలవలేకపోయింది. ఆ తర్వాత రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టి సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఆయన రాజ్యసభ పదవీకాలం 2018లో ముగిసింది.
2012లో చిరు కేంద్ర మంత్రి అయితే.. దాదాపు 12 యేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్.. విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మెగాభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హీరోలైన అన్నాదమ్ములు ఇద్దరిలో ఒకరు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తే.. మరొకరు రాష్ట్ర మంత్రి కావడం అనేది మెగా కొణిదెల ఫ్యామిలీలోనే సాధ్యమైందని చెప్పాలి.
Also read: Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook