Pawan Kalyan :ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఏది చేసినా సంచలనమే.అధికారంలో ఉన్నా , ప్రతిపక్షంలో ఉన్నా తాను స్పందించాల్సిన అంశాల పట్ల మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్  సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఏపీ హోం మంత్రి తీరును తప్పబడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద కాక రేపుతున్నాయి.గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న రేప్ సంఘటనలపై పవన్ చాలా సీరియస్ గా స్పందించారు.ఏపీలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై పవన్ ఫైర్ అయ్యారు. గత మూడు నెలలుగా ఏపీలో దారుణాలు పెరిగాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ అనడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే  అసలు పోలీసులు ఏం చేస్తున్నట్లు అని పవన్ ప్రశ్నించారు. పోలీసులు గత ప్రభుత్వంలా పని చేయవద్దంటూ ఏకంగా డీజీపీకే చురకులు అంటించారు.ఇదే సందర్భంలో పవన్ మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కులం పేరుతో తప్పు చేసిన వారిని వదిలి పెట్టవద్దని కూడా హెచ్చరించారు. అసలు పోలీసులు కులం పేరుతో ఎవరిని వదిలి పెట్టారు? ఎందుకు పవన్ అంతలా రియాక్ట్ అయ్యారనే చర్చ కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతుంది. కులం పేరు చెప్పి తప్పించుకుంటే మడత పెట్టి కొట్టండి అంటూ పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ పదవి నాకు ప్రజలు ఇచ్చారు వాళ్ల రక్షణ కోసం పని చేయాల్సిన భాద్యత నా మీద ఉందని  పవన్ అన్నారు.అంటే నిందితులను కాపాడే పనిలో ఎవరో ఉన్నట్లుగా పవన్ అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అంటే పోలీసులపై ఎవరిదో ఒత్తిడి ఉందనేలా పవన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అంతటితో ఆగని పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనితపై కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. హోం మంత్రిగా అనితగా పూర్తిగా విఫలం అయ్యారని డిప్యూటీ సీఎం పవన్ చెప్పడం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతే కాదు అనిత ఏపీలో జరుగుతున్న రేప్ ఘటనలకు బాధ్యత వహించాలని కూడా పవన్ అన్నారు. ఇంతకీ పవన్ మాటల వెనుక ఉన్న మర్మం ఏంటా అని ఏపీ పొలిటికల్ సర్కిల్ తీవ్రంగా జరుగుతుంది. అంటే పరోక్షంగా అనితను హోంమంత్రి పదవి నుంచి  తప్పుకోమని అనడమేనా దాని అర్థం అంటూ  రాజకీయ పార్టీల్లో తెగ చర్చ జరుగుతుంది. ఒక వైపు హోం మంత్రిగా అనితను బాధ్యతను వహించమని చెబుతూనే తాను హోం మంత్రి అయితే లెక్క వేరేలా ఉండేదని పవన్ అన్నారు. అవసరమైతే తాను హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటునాని పవన్ స్వయంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు తాను హోం మంత్రిగా అయితే మరో యోగి ఆదిత్యానాథ్ అవుతానని ప్రకటించడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇంతకీ అసలు పవన్ యోగీ ఆదిత్యా నాథ్ లా ఎందుకు మారాలనుకుంటున్నారు అనేది కూడా  పలు అనుమానాలకు తావిస్తుంది.అంటే ఏపీనీ పవన్ మరో యూపీలో మార్చాలని అనుకుంటున్నారా అనే టాక్ కూడా నడుస్తుంది.


ప్రస్తుతం పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న పవన్  ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హోం మంత్రి అయితే బాగుండని అనుకున్నారంట. కానీ వివిధ కారణాలతో చంద్రబాబు కేబినెట్ లో  పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉంటూ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా పవన్ కొన్ని కీలక అంశాల పట్ల మౌనంగా ఉన్నా మరి కొన్ని వాటి పట్ల మాత్రం తీవ్రంగా స్పందించిన సందర్భాలున్నాయి. ఇటీవల  సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు విషయంలో కూడా పవన్ చాలా ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాతే సనాతన ధర్మం పేరుతో  దేశ వ్యాప్తంగా సెన్షేనల్ గా మారారు.


ఇప్పటి వరకు ప్రతిపక్షం వైసీపీ టార్గెట్ గానే పవన్ కామెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఏకంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం కొంత రాజకీయంగా పలు సందేహాలకు తావిస్తుంది. ఎన్నికల ముందు తాను ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నామనే భావన వచ్చేలా ఇప్పుడు వపన్ మాట్లాడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నామే తప్పా తమ మాట చెల్లుబాటు అవడం లేదనే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడిన తీరుపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు పవన్ అసంతృప్తి దేనికి తానే హోం మంత్రిగా బాధ్యతలు చేపడుతానని ప్రకటించడం వెనుక ఉన్న పరమార్థం ఏంటా అని ఇప్పుడు ఏపీలో సాగుతన్న చర్చ. పవన్ మాటలను బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో పవన్ చాలా కాంప్రమైజ్ అయి కొనసాగుతున్నారా అన్న ప్రచారం కూడా  జరుగుతుంది.


మరి పవన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే  హోంమంత్రి అనిత భాద్యత వహించాలని పవన్ ప్రకటించిన నేపథ్యంలో అనిత ఏం చేయబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ మాటలను సీఎం చంద్రబాబు, అనితలు సీరియస్ గా తీసుకుంటారా లేదా లైట్ తీసుకుంటారా అనే చర్చ కూడా లేకపోలేదు. ఇవన్నీ కాదని పవన్ నే చంద్రబాబు హోం మంత్రి చేస్తారా అన్నది కూడా వేచి చూడాలి మరీ. 


Also Read: Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.