కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని ఇరకాటంలో పడేసిన పవన్
ఇటీవలికాలంలో బీజేపీ విషయంలో కాస్త సైలెంట్ గా పవన్ కల్యాణ్....కశ్మీర్ ఘటనతో ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై పవన్ స్పందిస్తూ ... దేశంలో యుద్ధం రాబోతుందని తనకు రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు చెప్పారని బాంబు పేల్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరకాటంలో పడ్డ కమలనాథులు !
మోడీ సర్కార్ కావాలనే సరిహద్దుల్లో యుద్ధానికి తెరతీశారనే అర్థం వచ్చే రీతిలో జనసేన చీఫ్ పవన్ స్పందించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. పవన్ తన వ్యాఖ్యలతో బీజేపీని ఇరకాటంలోని నెట్టేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అనుకూలంగా ప్రచారం చేశారు.. నాలుగేళ్ల పాటు వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించారు. ప్రత్యేక హోదా విషయంలో తేల్చలేదని ఆయన ఎన్టీయేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో నెట్టేసినట్లుయింది. తాజా వ్యాఖ్యలపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందనేది గమనార్హం.