సతీసమేతంగా పవన్ కళ్యాణ్ చర్చి ప్రార్థనలు..!
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరిచర్చికి తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరిచర్చికి తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ కూడా పాల్గొనడం గమనార్హం. ఈ రోజు ఉదయమే పవన్ కల్యాణ్ చర్చికి చేరుకున్నారు. ఆ తర్వాత జనసేన ఆఫీసులో ఆయన పలువురు పోలాండ్ ప్రతినిధులతో భేటీ అవ్వడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి కొందరు యువ ప్రతినిధులు కూడా హాజరవ్వగా పవన్ కళ్యాణ్ వారి ప్రశ్నలకు కూడా అదే సమావేశంలో సమాధానాలు ఇచ్చారు. అలాగే ఆ సమావేశాన్ని జనసేన తమ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లైవ్ చేయడం గమనార్హం. నిన్నే పవన్ కళ్యాణ్ తన ప్రజాయాత్ర ప్రారంభిస్తానని ట్విటర్ ద్వారా తెలిపారు.