Pawan Kalyan Will Meet Chandrababu Naidu: స్కిల్ డెలవప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనతో ములాఖత్‌ అయ్యేందుకు జనసేన పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లనున్నారు. చంద్రబాబును పరామర్శించి.. మద్దతు తెలపనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాజమండ్రి జైలు అధికారులకు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. చంద్రబాబు అరెస్టుపై సూపర్‌ స్టార్ రజనీకాంత్ స్పందించారు. నారా లోకేష్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని.. చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని అన్నారు రజనీ కాంత్. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడు చంద్రబాబు అని అన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని అన్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏమి చేయలేవని నారా లోకేష్‌తో రజనీకాంత్ అన్నారు.  


చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌. ఆయనను అరెస్ట్ చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసిన వారికి పుట్టగతులు ఉండవన్నారు. దీనికి త్వరలోనే పరిష్కరం ఉందన్నారు. 175 సీట్లలో 160 సీట్లను చంద్రబాబు కచ్చితంగా  గెలుచుకుంటారని జోస్యం చెప్పారు.


ఈ కేసులో చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆయన హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేయగా.. ఏపీ హైకోర్టులోనూ నిరాశ ఎదురైంది. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ బుధవారం విచారణకు రాగా.. విచారణను కోర్టు వారం రోజులు వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని ఆదేశించింది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ఈ నెల 19వ తేదీ వరకు విచారణకు బ్రేక్ పడింది. 


ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి  అభ్యంతరముంటే వేరే బెంచ్‌కు మారుస్తానన్నారు. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మాత్రం అభ్యంతరం లేదని చెప్పారు. అయితే సీఐడీ కస్టడీకి సంబంధించి కాస్త ఊరట కలిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల రిక్వెస్ట్‌ను పరిగణలోకి తీసుకుని.. ఈ నెల 18వ తేదీ వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. 


Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు  


Also Read: Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి