Ap Exit Poll 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం..
Ap Exit Poll 2024 In Telugu : సార్వత్రిక ఎన్నికల భాగంగా దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Ap Exit Poll 2024 In Telugu:పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. పవన్ కల్యాణ్‌కు ఆ స్థానం నుంచి 60 వేల నుంచి 70వేల మెజారిటీతో గెలవబోతున్నట్టు సర్వే పేర్కొంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు చెబుతున్నాయి. అక్కడ శాసనసభలో మొత్తం ఓటర్లు 2.35 లక్షలున్నారు. అక్కడ 86.63 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్ధిగా వంగా గీత వైపీసీ తరుపున పోటీ చేసింది. అక్కడ వంగా గీతపై పవన్ కళ్యాణ్ దాదాపు 60 వేలకు పైగా మెజారిటీతో గెలవబోతున్నట్టు పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేతో పాటు పలు మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని కాపు సామాజికవర్గం ఓట్లు 71 వేలు ఉన్నాయి. అందులో 69 వేల ఓటర్లు పవన్ కళ్యాణ్ కే ఓటు వేసినట్టు తెలిపింది. ఇతర సామాజిక ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కే జై కొట్టినట్టు వివరించింది.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో దాదాపు 10 పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయం అని చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. మొత్తంగా గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. కూటమిగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు చెబుతున్నట్టు టీడీపీ కూటమి అధికారంలో వస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని అందరు చెబుతున్నారు.
Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్' బాంబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter