Pawan Kalyan: కొణిదెల పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ నెల 19న ఈయన మంత్రిగా బాద్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు ఆశించే సినిమాలు ఇకపై చూడలేమా అంటే ఔననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. పవన్ కళ్యాణ్ కేవలం సినిమా నటుడిగానే కాదు.. జనసేన పార్టీ అధినేతగా ఏపీలో కూటమి ప్రభుత్వం తిరిగా అధికారంలోకి రావడంలో కీ రోల్ పోషించారు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏపీలో కూటమి విజయం దోహదం చేసిందనే చెప్పాలి. ఒక రకంగా ఏపీతో పాటు కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటులో జనసేన కీ రోల్ పోషించందనే చెప్పాలి. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్..  ఏపీ క్యాబినేట్ లో పర్యావరణం, అటవీ, గ్రామీణాభివృద్ధి సహా పలు కీలక శాఖల బాధ్యతలు ఆయనపై ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవైపు ప్రభుత్వ పరంగా పాలనా వ్యవహారాలను చక్కబెడుతూనే.. మరోవైపు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాలి. ఈ రెండింటికే ఆయన పూర్తి సమయం సరిపోతుంది. మరోవైపు సినిమాలు చేయాలంటే కత్తి మీద సామే అని చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘హరి హర వీరమల్లు’ రెండు పార్టులతో పాటు .. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తి చేయడానికే పవన్ కళ్యాణ్ నెలలో పది రోజులు పాటు సమయం కేటాయించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో ఆయా సినిమాలను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉన్నాయి.


ఈ నాలుగు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలేవి ఒప్పుకోవడం డౌటే అంటున్నారు. తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నారు. ఈ రకంగా అభిమానులకు పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు ఆశించడం భంగపాటే అవుతోంది. మరి అభిమానుల కోరిక తీర్చడానికి యేడాదికి ఒకటి చొప్పున సినిమా చేసినా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉంటారు. మరి పవన్ కళ్యాణ్.. సినిమాలను, రాజకీయాలను రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి.


Read more: Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter