ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షలకు సడలింపు ఇచ్చారు. నేటి నుంచి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు కొనసాగుతున్నాయి. వైన్ షాపులు, సెలూన్లు పునఃప్రారంభించారు. దీంతో జనం వాటి వద్ద భారీ క్యూలు కట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు నెల రోజులకు పైగా జనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం లేదు.  పైగా అంతా బంద్ వాతావరణం ఉంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు కూడా మూసివేశారు. దీంతో మద్యం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ  క్రమంలో నేటి నుంచి మద్యం దుకాణాలు తెరవగానే.. మద్యం షాపులకు జనం భారీగా పోటెత్తారు.  


మందు కోసం బారులు..!!


కృష్ణా జిల్లాలో  ముప్పాళ్ల గ్రామంలోని ఓ వైన్ షాపు వద్ద ఏర్పడిన క్యూ చూస్తే .. మద్యానికి ఎంత గిరాకీ ఉందో అర్ధమవుతుంది. నిజానికి లాక్ డౌన్ కంటే ముందు కూడా మద్యం దుకాణాల వద్ద భారీగా సందోహం ఉండేది. ఇప్పుడు అది కాస్తా మరింత పెరిగింది. ఐతే కృష్ణా జిల్లా ముప్పాళ్లలో కిలోమీటర్ల మేర జనం మద్యం కోసం బారులు తీరడం ఆశ్చర్యం కలిగిస్తోంది.



ఒక్కసారిగా జనం పోటెత్తడంతో పోలీసులు వారిని నియంత్రించడం కష్టంగా మారింది. మరోవైపు వారు సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.  దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..