హైదారాబాద్: వరుసగా 11వ రోజు పెట్రో ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 40 పైసలు, డీజిల్ పై 30 పైసలు తగ్గించినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ఉదయం  నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్  అయిల్ ధరలు తగ్గడంతో ఈ మేరకు పెట్రో ధరలు తగ్గించినట్లు తెలిసింది..ప్రస్తతం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59 , డీజిల్ ధర రూ. 74.22కి తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.84, డీజిల్ ధర రూ.  75.20కి తగ్గింది. రోజు రోజుకు పెట్రో ధరలు వీపరీతంగా పెరిగిపోయి సామాన్యుడిపై భారంగా మారిన తరుణంలో గత 11 రోజుల నుంచి  పెట్రో ధరలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:


  లీటర్ పెట్రోల్ ధర లీటర్ డీజిల్ ధర
హైదరాబాద్ రూ.81.59 రూ.74.22 
విజయవాడ రూ.82.84 రూ.75.20
ఢిల్లీ రూ.77.02 రూ.68.28
కోల్‌కతా రూ.79.68 రూ.70.83
ముంబై  రూ.84.84 రూ.72.70
చెన్నై రూ.79.95 రూ.72.08