TDP leader Venna Bala Koti Reddy severely injured in Gun Firing at Rompicherla: ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన బాలకోటి రెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ మండలాధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కుటుంబసభ్యుల ముందే రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో బాలకోటి రెడ్డికి తీవ్రంగా బుల్లెట్ గాయాలు అయ్యాయి. దుండగులు పారిపోగానే కుటుంబసభ్యులు అతడిని నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలకోటి రెడ్డికి చికిత్స జరుగుతోంది. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. 


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో వెన్నా బాలకోటి రెడ్డి కుటుంబసభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. గడ్డం వెంకట్రావు, పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడు కాల్పులో పాల్గొన్నట్లు సమాచారం తెలుస్తోంది. రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు పక్కా ప్లాన్‌తోనే దాడికి పాల్పడ్డారట. 


మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డిని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో పరామర్శించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. వెన్నా బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం చేయించాడని అరవింద బాబు ఆరోపించారు. బాలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత అని అన్నారు. బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తున్నామని అరవింద బాబు పేర్కొన్నారు. 


Also Read: 12 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్! విలువైన వస్తువులు ఇంటికి   


Aslo Read: Shukra Gochar 2023: అరుదైన నియతి పాలత్ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి సిరి సంపదలు! ప్రేమ వివాహం పక్కా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.