Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పవన్‌కల్యాణ్ ఓ సంచలనం.. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఏర్పడటంలో పవన్‌ కల్యాణ్‌దే కీలకపాత్ర.. పవన్‌ చాణక్యం వల్లనే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఏర్పాటైందని సీఎం చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా పవన్‌ కల్యాణ్‌ రచించిన వ్యూహాలు అద్బుతంగా పనిచేశాయని కితాబిచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఏర్పాటు కాగానే డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... ఇప్పుడు తన సోదరుడు నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనుక వ్యూహాలు వేరేలా ఉన్నాయని జనసేన పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్దిరోజులుగా ఢిల్లీ పెద్దల సన్నిహిత్యంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌కు అటు ఢిల్లీ పెద్దలు అపాయింట్‌ మెంట్‌ లేకుండానే కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ఏది అడిగినా కాదనకుండా ఓకే అనేస్తున్నారు. దాంతో బీజేపీ ప్యూచర్‌ స్టార్‌ పవనే అన్న మరో చర్చ జరుగుతోంది. అటు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా పవన్‌ కల్యాణ్‌కు ఎవరికి ఇవ్వనంతా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలని కేంద్ర పెద్దలు కూడా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారం నుంచి బంగ్లాదేశ్‌లో హింధువులపై దాడుల వరకు పవన్‌ చేసిన పోరాటాన్ని బీజేపీ పెద్దలు గుర్తించారు. ఈ పోరాటంతో పవన్‌ కల్యాన్‌కు హిందుత్వ వాదిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కంటే ఢిల్లీలోనే ఉంటేనే బాగుంటుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. ఇటీవల ఢిల్ఈ పర్యటనలోనే ఇదే విషయమై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.


వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేతను ఎంపీగా పోటీ చేయాలని కేంద్ర పెద్దలు కోరారట. కానీ పవన్‌ మాత్రం తాను ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటున్నట్టు వారితో చెప్పారట. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అయితే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి మద్దతుగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్‌  పోటీ చేసినా అన్నిచోట్ల బీజేపీ అభ్యర్ధులు ఘనవిజయం సాధించారు. దాంతో పవన్‌ కల్యాణ్‌ మరోసారి జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. దాంతో త్వరలో జరిగే ఢిల్లీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్‌ కల్యాణ్‌ సేవలను వాడుకోవాలని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే పవన్‌ కల్యాణ్‌ను జాతీయ రాజకీయాల్లో బిజీబిజీ చేయాలని ఎన్డీయే పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్‌ నాగబాబును రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లడం ద్వారా రాష్ట్రంలో నాగబాబును కీలకం చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే పట్టుబట్టి మరి నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించుకున్నారని అంటున్నారు. మొత్తంగా జాతీయ రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ బిజిబిజీ అయితే మాత్రం ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కొచ్చని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన కూడా చెయ్యోచ్చని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.


Also Read: MBNR POLITICS: పాలమూరులో డీసీసీ ఫైట్‌.. చీఫ్‌ పదవి ఎవరికంటే?


Also Read: Congress Politics: రేవంత్‌కు టెన్షన్‌.. కేబినెట్‌లో విస్తరణలో కొత్త ట్విస్ట్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.