సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్..ఏపీలోని వరద పరిస్థితులపై ఆరా..
ఏపీలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
AP Rains: ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ(PM Modi) ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఆరా తీశారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితుల గురించి ప్రధానికి సీఎం(AP CM YS Jagan) వివరించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను గురించి తెలిపారు. సహాయ చర్యలకు నేవీ హెలికాప్టర్లు వాడుకుంటున్నట్లు చెప్పారు. వరద సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని సూచించారు.ఈ మేరకు మోదీ ట్వీట్(Tweet) కూడా చేశారు. అది తెలుగులో.
Also Read: సీఎం జగన్: వర్షాల కారణంగా మృతి చెందితే రూ.5లక్షలు..ముంపు బాధితులకు రూ.2వేలు..
రేపు జగన్ ఏరియల్ సర్వే..
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే(Aerial Survey) నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో సీఎం విహాంగ వీక్షణం ద్వారా పరిస్థితి సమీక్షిస్తారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకోనున్న సీఎం(CM Jagan)..హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు సీఎం జగన్.. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.
Also Read: తిరుమలలో వరద బీభత్సం..జలదిగ్బంధంలో శ్రీవారి ఆలయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook