PM Modi Tour in AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వరుసగా ఆ పార్టీ పెద్దలు ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు రానున్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 2, 3 తేదీల్లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభలోనూ మోదీ పాల్గొని ప్రసంగించబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే నెల 2న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. జూలై 2,3 తేదీల్లో భాగ్యనగరంలోనే ఉంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బీజేపీ నేతల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. జూలై 4న భీమవరానికి చేరుకుంటారు. అక్కడ జరిగే అల్లూరి సీతారామ రాజు జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


ఇందులోభాగంగా అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకల్లో భాగస్వామ్యం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రధాని మోదీ కార్యక్రమంలో టీడీపీ తరపున ప్రతినిధి పంపాలని ఆహ్వానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. లేఖతోపాటు చంద్రబాబుకు ప్రత్యేకంగా ఫోన్ చేశారు కిషన్‌రెడ్డి. అల్లూరి సీతారామరాజు వేడుకల్లో టీడీపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు. 


[[{"fid":"236405","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..!


Also read:Sanjay Raut: అంతా కలిసి ఉద్దవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారు..సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook