అవిశ్వాస తీర్మానంపై ప్రధాని ఏమన్నారంటే...
టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై ప్రధాన మోడీ ట్విట్టర్ లో స్పందించారు..మోడీ ఏమన్నారంటే.. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన రోజు.. అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనే ఆశిస్తున్నాను. రాజ్యాంగానికి లోబటి ప్రజలకు మంచి పాలన అందిస్తామని మనం ప్రమాణం చేశాం. దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తోందని మోదీ ట్వీట్ చేశారు.
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. లోక్ సభలో సంపూర్ణ బలముందని మోడీ సర్కార్ ధీమాతో ఉండగా.. ..ఏమైనా జరగవచ్చని విపక్షాలు చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నరాలు తెగే రీతో ఉన్న ఈ ఉత్కంఠత ఈ రోజు తెరపడనుంది.