న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ అనుమతిని తిరిగి ఉహసంహరించుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. ఏదో తప్పు చేసినట్టుగా ఆ రాష్ట్రాలన్నీ సీబీఐని చూసి ఎందుకు అంతగా  భయపడుతున్నాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఇవాళ సీబీఐకి అనుమతి నిరాకరించిన ఆ రాష్ట్రాలు రేపు ఇంకొన్ని కేంద్ర సంస్థలను నిషేధించే అవకాశం లేకపోలేదని మోదీ అభిప్రాయపడ్డారు. 


సీబీఐకి అనుమతి నిరాకరించిన విషయంలో మూడు రాష్ట్రాల తీరును తప్పుపట్టే క్రమంలో.. ''ఆర్మీ, పోలీసులు, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం, కాగ్ వంటి సంస్థలన్నీ తప్పు చేసేవే కానీ వాళ్లు( ఆ మూడు రాష్ట్రాలు) మాత్రమే సక్రమంగా నడుచుకుంటున్నారు'' అని మోదీ ఎద్దేవా చేశారు. నేడు ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.