పోలవరం ప్రాజెక్టుపై నేడు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఏపీ నీటిపారుల శాఖమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు పాల్గొనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరంపై గతవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా పర్యటనకు బయల్దేరే ముందు సీఎం ఢిల్లీ వెళ్లారు. అక్కడ గడ్కారీని కలిసి పోలవరం అంశాలపై మాట్లాడాలనుకున్నారు. కానీ ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. అయితే కొరియా పర్యటనలో ఉన్న సీఎం నేడు జరగబోయే సమావేశానికి అక్కడి నుండే మంత్రి, నీటిపారుదల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.


పోలవరం పనులను పరిశీలించిన దేవినేని 


ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం పోలవరం ప్రాజెక్టును  సందర్శించారు. కాఫర్ డ్యాం, దయాఫ్రమ్ వాల్, స్పిల్వే పనులను పరిశీలించి.. అక్కడే ఉన్న ఇంజనీర్లతో పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు