Polavaram Project: ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణంలో కీలకఘట్టం అవిష్కృతమయ్యింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్లను (Radial gates) బిగించడం పూర్తైంది. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాటికి 48 గేట్లను అధికారులు బిగించారు. గత సీజన్‌లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు ఇప్పుడు పూర్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు ఇంజనీరింగ్ అధికారులు. 10 రివర్ స్లూయిజ్ గేట్లను, వాటికి 20హైడ్రాలిక్ సిలిండర్ల తో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చడం పూర్తి అవుతుంది. హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తైతే గేట్ల ఆపరేటింగ్ చేయవచ్చు. ఇప్పటికే గేట్లను ఎత్తడానికి అవసరమైన 24  పవర్ ప్యాక్ సెట్ల అమర్చారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25శాతం పైగా పూర్తి కాగా.. స్పిల్ వే లో 3,32,114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. స్పిల్ వే లో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం సైతం పూర్తి చేశారు. 


గత వారమే కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ,  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్లి  ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.55,548.87 కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని ఏపీ అధికారులు కేంద్ర మంత్రిని కోరారు. తాగునీటి కాంపొనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: PIL against New Districts: జగన్ సర్కార్‌కు మరో షాక్.. కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్..


ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కాంపొనెంట్‌ వారీగా రీయింబర్స్‌ చేస్తోందని, కాంపొనెంట్‌ వారీగా నియంత్రణల వల్ల కొన్ని పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని కేంద్రమంత్రికి సీఎం జగన్ వివరించారు.  చేసిన పనులకు బిల్లులు కూడా రావడం లేదని తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఒకే కాంపొనెంట్‌గా తీసుకుని, ప్రతి 15 రోజుల కొకసారి బిల్లులను చెల్లించాలని ఏపీ సీఎం కోరారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook