Andhra Pradesh CM YS Jagan Mohan Reddy sensational comments on opposition: అధికారం దక్కలేదనే అక్కసుతోనే ఏపీలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారంటూ విపక్షాలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారని వైఎస్‌ జగన్ (YS Jagan) ఆరోపించారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న జగన్‌ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపై మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్‌ అడిక్ట్స్‌గా (Drug Addicts) ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోందన్నారు సీఎం జగన్. ఇది అత్యంత తీవ్రమైన నేరంమని తెలిపారు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, (Central Government) డీఆర్‌ఐ వివరణ ఇచ్చినా, విజయవాడ సీపీతో పాటు డీజీపీ సైతం ఆ ఆరోపణలు అబద్ధాలు అని పదేపదే చెప్పినా కూడా అక్కసుతో వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. 


Also Read : Police Commemoration Day 2021: ఏపీ పోలీసులకు గుడ్‌ న్యూస్ చెప్పిన సీఎం జగన్‌


కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి సీఎం జగన్ పేర్కొన్నారు. చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారని జగన్ అన్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారని బాధపడ్డారు జగన్. ముఖ్యమంత్రిపై (Chief Minister) పరుష పదజాలం వాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు.. సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారని జగన్ అన్నారు. 


పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అతి ముఖ్యమైన విషయమని చెప్పారు. పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దు... తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు అని సూచించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan). 


Also Read : 100 crore vaccination: నేడు 100 కోట్ల డోసులకు చేరనున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి