కడప: టీడీపీ ఎంపీ సుజానా ఆస్తుల ఎటాచ్మెంట్ ఘటన మరుకముందే మరో టీడీపీ నేతకు షాక్ తగిలించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నివాసంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.కడప జిల్లాలోని ఎర్లగుంట్ల మండలం పోట్లదుర్తిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో  30 మంది వరకు పోలీసులు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనిఖీల్లో భాగంగా సీఎం రమేష్ బెడ్ రూం సహా అన్ని గదుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. మూడంతస్తుల భవనంలో అణువణువూ సోదాలు చేపట్టారు. తనిఖీల్లో ఏమీ లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు


తనిఖీల సమయంలో సీఎం రమేష్ తో పాటు ఆయన సోదరుడు ఇంట్లోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఎందుకు వచ్చారని సీఎం రమేష్ పోలీసులను నిలదీశారు. అరెస్ట్ వారెంట్ ఉందా..తనిఖీలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉన్నాధికారుల ఆదేశాలతోనే తాము తనిఖీలు చేస్తున్నామని మత్రమే పోలీసులు వివరించారు..


సీఎం రమేష్ ఇంట్లో ఎందుకు తనిఖీలు నిర్వహించారో పోలీసులు వివరించలేదు. అయితే ఆయనతో పాటు ఆయన అనుచరుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహించిన తీరు చూస్తుంటే ఎన్నికల సమయంలో డబ్బులు, నగలు పంపిణీ చేసినట్లు ఎవరైన ఫిర్యాదు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉండగా ఆకస్మిక తనిఖీలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇది ముమ్మటికి టీడీపీపై కక్షసాధింపు చర్యలో భాగమేనని నేతలు ఆరోపిస్తున్నారు.