వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై పోలీసుల ప్రశ్నల వర్షం
వైఎస్ వివేక హత్య కేసులో విచారణ జరుపుతున్న సిట్ అన్నికోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసింది .ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న అనేక మందిని విచారించిన పోలీసులు..ఇప్పుడు వైయస్ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన అవినాష్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. అవినాస్ నుంచి పలు ప్రశ్నల సంధించిన పోలీసులు ... వివేకా హత్యకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం
అవినాష్ రియాక్షన్....
పోలీసుల విచారణ అనంతరం వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వివేహ హత్య కేసలో పోలీసులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని మీడియాకు తెలిపారు. వివేకా మృతి తర్వాత సీఐతో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ మండిపడ్డారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తాను సీఐతో చెప్పినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అవినాష్ స్పష్టం చేశారు. గుండెపోటుతో చనిపోయారా అని సీఐ అడిగితే... రక్తపు మడుగులో పడివున్నారని మాత్రమే చెప్పానని అవినాష్ వెల్లడించారు.
వాంగ్మూలం నమోదు
ఇదిలా ఉండగా ఈ కేసు విచారణ కోసం సిట్ ఐదు బృందాలను నియమించింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసును ఛేదించే పనిలో ఈ టీమ్ లు ఉన్నాయి. ఇప్పటికే 20 మందిని విచారించిన పోలీసలు... వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిన్న వివేకా సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బావమరిది శివప్రకాష్ రెడ్డి, జగన్ అనుచరుడు శంకర్ రెడ్డిని విచారించారు.