అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి (Coronavirus) వేగంగా వ్యాపిస్తోంది. సామాన్య ప్రజల నుంచి నాయకులు, ప్రజా ప్రతినిధులు వరకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అధికారపార్టీ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. ఈ విషయాన్ని గుంటురు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన కిలారి రోశయ్య (kilari rosaiah) సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. గురువారం టెస్టులు చేయించుకున్నానని, కలెక్టరేట్‌లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందన్నారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని రోశయ్య తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానంటూ పేర్కొన్నారు. Also read: AP COVID19 Deaths: ఏపీలో 200 దాటిన కరోనా మరణాలు


భయాందోళనలో ప్రజాప్రతినిధులు, అధికారులు..
ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటీవ్ అని తెలియడంతో కలెక్టరేట్‌లో మీటింగ్‌కు హాజరై ఆయనతో సన్నిహితంగా మెదిలిన అధికారులు, మిగతా ప్రజా ప్రతినిధులు భయాందోళనకు గురవుతున్నారు. 
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..