Posani Krishnamurali: మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వంగవీటి రంగా హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఓ బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ అధినేత, సీఎం జగన్‌ ఈ హత్యపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని సంచలన ప్రకటన చేశారు. తాజాగా అదే విషయాన్ని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. 'వంగవీటి రంగాను చంపించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. ఈ విషయం రంగా కుమారుడికి, ప్రజలందరికీ తెలుసు' అని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirupati Capital: మిగతావేవీ వద్దు.. ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రాజధాని చేయాల్సిందే!


హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోసాని కృష్ణమురళీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం కేవలం కాపుల కోసమే ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కాపులకు పవన్‌కల్యాణ్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన పవన్‌కల్యాణ్‌పై కాపులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. కానీ చంద్రబాబుతో పొత్తులు కుదుర్చుకుని కాపులకు పవన్‌ దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా తర్వాత కాపు కులంలో పవన్‌ సీఎం అవుతాడని కాపులే ఎంతో నమ్మారని పేర్కొన్నారు. కాపులను గతంలో చంద్రబాబు గూండాలు, రౌడీలు ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబుకు ఓటు వేయాలని పవన్‌ చెబుతుండడం సిగ్గు చేటన్నారు. రంగాను అభిమానించే వారు ఎవరైనా 'సైకిల్‌' గుర్తుకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. 

Also Read: Ra Kadili Ra: మా కోసం కాదు.. ఏపీ రాష్ట్ర భవిష్యత్‌ కోసమే టీడీపీ, జనసేన పొత్తు


'వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే. రంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సుమారు 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసేవాడు. కాపులకు వంగవీటి రంగా పెద్ద హీరో. తనకు ప్రాణహాని ఉందని అప్పటి సీఎం ఎన్టీఆర్‌, హోం మంత్రి కోడెల శివప్రసాదరావుకు మొరపెట్టుకున్నాడు. భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయగా చంద్రబాబు వలనే రంగాకు భద్రత కల్పించలేదు. చివరికి ఊహించినట్టే రంగా హత్యకు గురయ్యాడు. రంగా బతికి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు' అని పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook